- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో మైనర్ బాలికపై అత్యాచారం: ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూరులోని సనిగవాన్‌లో సైకిల్ రిపేర్ షాప్ యజమాని ముఖేష్ గుప్తా

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూరులోని సనిగవాన్‌లో సైకిల్ రిపేర్ షాప్ యజమాని ముఖేష్ గుప్తా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే యజమాని కూతురు ఎనిమిదేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పిటిషన్ ఇచ్చి నాలుగు రోజులు దాటినా నిందితుడిపై కేసు నమోదు చేయలేదు. దీంతో అసంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు కాన్పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్కే సింగ్‌ను సంప్రదించారు. జరిగిన విషయం మొత్తం ఆయనకు చెప్పగా వెంటనే ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి పరారీలో ఉన్న నిందితుడు ముఖేష్ గుప్తా ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు.






