- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడుముకు కట్టుకొని రూ.లక్షల నగదును తీసుకెళ్తున్న వ్యక్తులు
by Bhoopathi Nagaiah |
ఎంతో తెలివిగా వ్యవహరించి రూ.10 లక్షలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

X
దిశ, దమ్మపేట : ఎంతో తెలివిగా వ్యవహరించి రూ.10 లక్షలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం దమ్మపేట మండల కేంద్రంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వేడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ వెళ్తుండగా వారిపై అనుమానం వచ్చి పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆ ఇద్దరిని తనిఖీ చేయగా ఇరువురు నడుముకు రూ.5 లక్షల చొప్పున కట్టుకుని రూ.10 లక్షలను తరలిస్తున్నారు. ఆ డబ్బుల వివరాలు అడగ్గా సరైన సమాధానం చెప్పకపోగా.. ఎలాంటి రశీదులు చూపించకపోవడంతో సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
Next Story






