- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూదానికి బానిసై భార్యనే పణంగా పెట్టిన భర్త.. కీచకులుగా మారిన స్నేహితులు
భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు స్నేహితులకు అనుమతిస్తూ జూదం ఆడాడు.

దిశ, వెబ్‌డెస్క్: జూదానికి బానిసైన ఓ భర్త ఏకంగా తన భార్య (wife)నే పణంగా పెట్టాడో దుర్మార్గుడు. భార్యపై లైంగిక వేధింపులకు (molestation) పాల్పడేందుకు స్నేహితులకు అనుమతిస్తూ జూదం ఆడాడు. ఇక అతడు ఓడిపోవడంతో రెచ్చిపోయిన అతడి స్నేహితులు (Friends) ఆమెపై దాడిచేయడమే కాకుండా ఇంటి నుంచి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లో జరిగింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. యూపీ రాంపూర్‌లోని షహబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళకి 2013లో వివాహమైంది. పెళ్లైన తర్వాతి నుంచే అత్త, భర్త కట్నం కోసం వేధించేవారని, భర్త మద్యం, జూదానికి బానిసై 7 ఎకరాల భూమిని అమ్ముకున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
చివరికి జూదం (Gambling)లో అతని స్నేహితుల వద్ద తనను కూడా పణంగా పెట్టాడని, తనను లైంగికంగా వేధించడానికి వారికి అనుమతిచ్చి జూదం ఆడాడని చెప్పింది. అతడు ఓడిపోవడంతో వాళ్లంతా తనని ఇంటి నుంచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని, తాను నిరాకరించడంతో వాళ్ల ముందే తనపై దాడికి పాల్పడ్డాడని వాపోయింది. ఆ తర్వాత తాను పుట్టింటికి వెళ్లిపోతే అక్కడకు కూడా వచ్చి తన వేలు విరిచి, దాడికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వేధింపులు భరించలేదక 112 మహిళా హెల్ప్‌లైన్ (Women Helpline)కి ఫోన్ చేశానని, తన ముగ్గురు పిల్లలని తనని కాపాడి.. తన భర్త, అతడి స్నేహితులను శిక్షించాలని పోలీసులను కోరింది. అయితే పోలీసులు రావడంతో ఆమె భర్త పారిపోయినట్లు రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.






