Hanamkonda: హనుమకొండలో వినూత్న రీతిలో మోటార్ల చోరీ, ఐదుగురు నిందితుల అరెస్ట్

by Disha Web Desk 1 |
Hanamkonda: హనుమకొండలో వినూత్న రీతిలో మోటార్ల చోరీ, ఐదుగురు నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: వినూత్నంగా విద్యుత్ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టైన ఘటన హనుమకొంట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఐదుగురు యువకులు వినూత్నంగా వరుస చోరీలకు పాల్పడుతూ.. విచ్చలవిడిగా జల్సాలకు అలవాటు పడ్డారు. ముందుగా ఐదుగురు కలిసి కార్లను అద్దెకు తీసుకుని సమీప గ్రామాల్లోని వ్యవసాయ పొలాలపై ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం అదును చూసి మోటార్ల చోరీ చేసి బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాధిత రైతులు తమ మోటార్లు చోరీకి గురవుతున్నాయంటూ సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి నుంచి 11 మోటార్లు, 2 కార్లు, భారీ ఎత్తున విద్యుత్ తీగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed