- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
by Sridhar Babu |
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

X
దిశ, దమ్మపేట : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వీధికి చెందిన గోలి నాగరాజు గ్రామాల్లో తిరుగుతూ ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జల్సాలు చేసేవాడు.
దీంతో పోలీసులకు సమాచారం అందడంతో గోలి నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించి దొంగతనాలు చేసిన మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, గోలి నాగరాజు పై మూడు కేసుల నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు. దొంగను పట్టుకొని ద్విచక్ర వాహనాలు రికవరీ కావడానికి కీలకపాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, కానిస్టేబుల్ లక్ష్మణ్ ను ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి అభినందించారు.
- Tags
- arrest
Next Story






