- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ నిర్లక్ష్యంతో ఐదు రోజుల బాలుడు మృతి.....
డాక్టర్ చేసిన నిర్లక్ష్యంతో ఐదు రోజుల బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం రోజు దేవరకొండ పట్టణంలోని ప్రైవేట్ రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

దిశ, చింతపల్లి (దేవరకొండ) : డాక్టర్ చేసిన నిర్లక్ష్యంతో ఐదు రోజుల బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం రోజు దేవరకొండ పట్టణంలోని ప్రైవేట్ రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమల తండాకు చెందిన ఇస్లావత్ జ్యోతి రమేష్ దంపతులకు పెండ్లి అయిన 8 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా బాబుకు కామెర్లు రావడంతో దేవరకొండలోని రెయిన్బో పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. హాస్పిటల్ లో జాయిన్ చేసిన తర్వాత ఒకరోజు బాగానే ఉన్నాడు.
మరుసటి రోజు బాబుకు బాగాలేదు అని డాక్టర్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. డాక్టర్ బాబు రామ్ నిర్లక్ష్యంతోనే మృతిచెందినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి ముందు ధర్నాలు చేస్తూ హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి ఆందోళన చేపట్టారు. బాబు మృతితో బాధితులు రోదనకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ సొంత ప్రైవేట్ హాస్పిటల్ నిర్మించుకున్న ప్రైవేటు ఆసుపత్రులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు చొరవ తీసుకొని హాస్పిటల్ సీల్ చేయాలని, కుటుంబ సభ్యులతో కలిసి సేవాలాల్ బంజారా సంఘం అధ్యక్షుడు చందు నాయక్ ధర్నా చేపట్టారు.






