- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్
by Sridhar Babu |
గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, చెన్నూర్ : గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెట్రోలింగ్ లో భాగంగా కిష్టంపేట శివారులో అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురు యువకులను తనిఖీ చేయగా వారి వద్ద 90 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 3 సెల్ ఫోన్ లు సీజ్
చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ జరిపించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో జనగామ రజినీకాంత్ , సయ్యద్ అజ్జు , దాసరి అరుణ్, జాడి సాయిపవన్, ఎండీ తోఫిక్ ఉన్నారు. నిషేధిత గుట్కా, గంజాయి, గుడుంబా తయారీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రవీందర్ హెచ్చరించారు.
- Tags
- Five arrested
Next Story






