- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రోజులు జ్వరం....ఆపై బాలిక మృతి
డెంగీతో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది.

దిశ, చిలుకూరు : డెంగీతో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం చిలుకూరుకు చెందిన అమరగాని భవ్యశ్రీ (12) రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతుండడంతో ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటోంది. మంగళవారం బాలికను పరిశీలించిన కోదాడ వైద్యులు ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
బాలికను ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరిశీలించి హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం రాత్రి బాలికను హైదరాబాద్ ఆసుపత్రి వైద్యులు పరిశీలించి మార్గమద్యలోనే మృతి చెందినట్లుగా నిర్ధరించారు. డెంగీ ప్రాథమిక లక్షణాలతోనే బాలిక మరణించిందని భావిస్తున్నారు. భవ్యశ్రీ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బాలిక మృతిపై బంధువులు, సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.
- Tags
- dengue






