- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: రౌడీ షీటర్లకు చార్మినార్ డీసీపీ స్ట్రాంగ్ వార్నింగ్
by GSrikanth |
ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు సోమవారం రాత్రి కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో 160 మంది పోలీసులు చార్మినార్ స్టేషన్ పరిధిలోని పార్ధీవాడలో తనిఖీలు జరిపారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు సోమవారం రాత్రి కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో 160 మంది పోలీసులు చార్మినార్ స్టేషన్ పరిధిలోని పార్ధీవాడలో తనిఖీలు జరిపారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. బెల్ట్ షాపులపై దాడులు చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మాట్లాడుతూ కమిషనర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిపినట్టు చెప్పారు. రౌడీ షీటర్లు హద్దులు దాటితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ షేక్ జహంగీర్, చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






