- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > old crime > BREAKING: శ్రీరామ శోభాయాత్రలో దొంగల చేతివాటం.. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు మాయం
BREAKING: శ్రీరామ శోభాయాత్రలో దొంగల చేతివాటం.. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు మాయం
by Kema Shiva Kumar |
శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి నగరం నలుమూలల నుంచి బీజేపీ శ్రేణలు, రామ భక్తులు, హిందూ సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ట అనంతరం వచ్చిన మొదటి శ్రీరామ నవమి కావడంతో శోభాయత్ర కాషాయ జెండాలతో కదం తొక్కింది. ఈ క్రమంలోనే శోభాయాత్రలో జేబు దొంగలు దూరి తమ ప్రతాపాన్ని చూపారు. పలువురి భక్తుల ఖరీదైన సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలను తస్కరించారు. దాదాపు 16 సెల్‌ఫోన్లు, 3 బంగారు గొలుసులు, ఓ బ్రాస్‌లెట్ చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితులంతా కలిసి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Next Story






