BREAKING : అంతర్జాతీయ ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. ఇద్దరి అరెస్ట్

by Kema Shiva Kumar |

అంతర్జాతీయ ఫేక్ కరెన్సీ నోట్ల దందా చేస్తున్న ఓ ముఠాను ఇవాళ సైబరాబాద్ పోలీసులు ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.

BREAKING : అంతర్జాతీయ ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. ఇద్దరి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఫేక్ కరెన్సీ నోట్ల దందా చేస్తున్న ఓ ముఠాను ఇవాళ సైబరాబాద్ పోలీసులు ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు.కెమెరోన్, మాలి దేశాలకు చెందిన కోంబిఫ్రాంక్, గోయిట సోంగా అనే వ్యక్తులు కొన్నాళ్ల క్రితం ఇండియాకు వచ్చారు. వీసా గడవు ముగిసినా.. తిరిగి వారి దేశాలకు వెళ్లకుండా ఇక్కడే మకాం వేశారు. ఇతర దేశాలకు చెందిన కరెన్సీని నోట్ల దందా చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు నిందుతులు కోంబిఫ్రాంక్, గోయిట సోంగాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారితో పాటు ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story