- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఆదిలాబాద్ జిల్లాలో పట్టపగలే ఘోరం.. భార్య గొంతు కోసి చంపిన భర్త
by Kema Shiva Kumar |
పట్టపగలే భార్య గొంతు కోసి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పట్టపగలే భార్య గొంతు కోసి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బేలా మండల పరిధిలోని సైదాపూర్ గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన భర్త.. కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అతడు కూడా గొంతు కోసుకుని ప్రణాలు విడిచాడు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలాానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






