BREAKING: మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన.. నవ వధువు బలవన్మరణం

by Kema Shiva Kumar |

నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలో తెల్లవారుజామున చోటుచేసుకుంది.

BREAKING: మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన.. నవ వధువు బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు ఈ నెల 4న తన మేనబావతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయితే, ఆ పెళ్లి బాలికకు ఇష్టం లేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. తాను చదువుకుంటానని చెప్పినా చిన్న వయసులోనే తనకు పెళ్లి చేశారంటూ బాత్ రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story