- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
by Sridhar Babu |
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

X
దిశ,నెక్కొండ : ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామానికి చెందిన పోరండ్ల వెంకన్న (53) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. శనివారం వెంకన్న భార్య లక్ష్మి కూలి పనులకు వెళ్లింది. పెద్ద కూతురు వివాహం చేసిన వెంకన్నకు వివాహం కావాల్సిన మరో కూతురు, కుమారుడు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఆటో పై సంపాదన అంతంత మాత్రంగానే ఉండడంతో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- suicide
Next Story






