ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం

by Kalyani |
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మురళీగూడ క్యాంపు సమీపంలోని ఇట్కల్ గ్రామంలో చేతబడి చేస్తున్నారనే నెపంతో గ్రామస్తులు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను కత్తులతో నరికి చంపారు. చేతబడి చేయడం తోనే తమ కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యానికి గురయ్యాడనే అనుమానంతో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.

Advertisement

Next Story