నిజామాబాద్‌లో దారుణం.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్

by Disha Web Desk 1 |
నిజామాబాద్‌లో దారుణం.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర పరిధిలోని కోటగల్లిలో ఉన్న లావణ్య అక్రేడ్ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. వివరాల్లోకి వెళితే.. వాష్ రూంకు లిఫ్ట్‌లో వెళ్లి తిరిగి గ్రౌండ్ ఫ్లోర్‌లో దిగేందుకు కాళ్లు బయటపెడుతుండగా లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ క్రమంలో అతడి కాళ్లు బయట, బాడీ లోపల ఉండిపోయి అందులోనే ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ కాళ్లు, చేతులు విరిగి కొన ఊపిరి కొట్టుమిట్టాడాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నిజామాబాద్ ఫైర్ స్టేషన్‌లోని రెస్క్యూ టీం రంగంలోకి దిగి అరగంట పాటు శ్రమించి బాధితుడిని లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. అనంతరం అతడిని 108 వాహనంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు.


Next Story

Most Viewed