తలకొండపల్లిలో రెచ్చిపోయిన దొంగలు..మూడు ఇండ్లలో చోరీ

by Chintha Aamani |

రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో

తలకొండపల్లిలో రెచ్చిపోయిన దొంగలు..మూడు ఇండ్లలో చోరీ
X

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలో మంగళవారం నాలుగు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు బీరువాలలోని బట్టలను ,దస్తావేజులు చిందరవందరగా వేసి వెళ్లిపోయారు. ఆవంచ చేన్న కేశవరెడ్డి ఇంట్లో రూ. 6 లక్షల నగదు, దోమ సురేష్ రెడ్డి ఇంట్లో మూడు తులాల బంగారం, దోమ రాంరెడ్డి ఇంట్లో మూడున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. నాయిని మాధవరెడ్డి ఇంట్లో మాత్రం చోరీకి పాల్పడిన ఏమీ ఎత్తుకెళ్లలేదని తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మండల కేంద్రంలోని సీసీ కెమెరాలు లేకపోవడం వల్లే దొంగలు విచ్చలవిడిగా చోరీకి పాల్పడినట్లు మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతాన్ని అమంగల్ సీఐ ప్రమోద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు వెంటనే మండల కేంద్రంలోని సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story