Atrocious: ఢిల్లీలో దారుణం.. 24 గంటలపాటు ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం..

by Disha Web Desk 3 |
Atrocious: ఢిల్లీలో దారుణం.. 24 గంటలపాటు ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం..
X

దిశ వెబ్ డెస్క్: కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాందుడు మానవత్వాన్ని మరిచి మృగంలా మారాడు. పసిపాప అనే కనికరం కూడా లేకుండా ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. 24 గంటలపాటు ఆ చిన్నారిని హింసించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని కోట్ల ముబారక్‌పూర్ ప్రాంతం దగ్గర ఈ నెల 6వ తేదిన చిన్నారి కిడ్నాప్‌కు గురైంది.

కాగా కిడ్నాప్‌కు గురైన చిన్నారిని పోలీసులు 24 గంటల తరువాత రక్షించారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. ఈ నెల 6వ తేదిన చిన్నారి కిడ్నాప్‌కు గురైందని, కాగా కిడ్నాప్‌ జరిగిన 24 గంటల్లో చిన్నారి రక్షించినట్టు తెలిపారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దుండగుడు చిన్నారిపై గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డినట్టు తెలిపారు. చిన్నారి శరీరంపై పలు చోట్ల గాయాలు, పంటిగాట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.

నేరస్థుడి నుండి రక్షించిన తరువాత చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలిపారు. ప్రస్తుతం చికిత్సపొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. అయితే మానసికస్థితి మాత్రం మేరుగుపడలేదని, ఇప్పటికీ ఆ దారుణ ఘటన గురించి చిన్నారి భయపడుతూనే ఉంది అని తెలిపారు. అలానే చిన్నారి తన కుటుబంలో ఆమె తల్లిని మాత్రమే గుర్తించగలుగుతోందని పేర్కొన్నారు.

నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా నేరస్తుడు అర్జున్, అలియాస్ మహమ్మద్ ఉమర్‌గా గుర్తించారు. అతను గతంలోనూ ఇలాంటి దారుణాలకు పాల్పడినట్టు భావిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed