young man died : బొలెరో వాహనం ఢీకొని యువకుడు మృతి

by Sridhar Babu |

తలకొండపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో గురువారం రాత్రి వివేకానంద విగ్రహం సమీపంలో బొలెరో వాహనం ఢీకొని వడ్డే వేణు (22) అనే యువకుడు మృతి చెందాడు.

young man died : బొలెరో వాహనం ఢీకొని యువకుడు మృతి
X

దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో గురువారం రాత్రి వివేకానంద విగ్రహం సమీపంలో బొలెరో వాహనం ఢీకొని వడ్డే వేణు (22) అనే యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన వడ్డే ఎల్లయ్య చిన్న కుమారుడు వేణు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బొలెరో వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే 108 అంబులెన్స్ లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

Next Story