ట్రైన్ కిందపడి యువకుడు ఆత్మహత్య

by Sridhar Babu |

ట్రైన్ కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మధిర- తొండలగోపారం స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది.

ట్రైన్ కిందపడి యువకుడు ఆత్మహత్య
X

దిశ, మధిర : ట్రైన్ కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మధిర- తొండలగోపారం స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. ఖమ్మం జీఆర్పీఎస్ ఎస్ఐ పి.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన శెట్టి రఘువర్మ (22) ప్రస్తుతం మండల పరిధిలోని రాయపట్నం గ్రామంలో తన అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తనకు ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కరరావు తెలిపారు.

Next Story