Arrest : గంజాయి విక్రయానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

by Aamani |
Arrest : గంజాయి విక్రయానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
X

దిశ,షాద్ నగర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన ఫరూఖ్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో చోటుచేసుకుంది. షాద్ నగర్ ఎక్సైజ్ సీఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన తరుణ్ జోష్ జైన్ అనే వ్యక్తి గత 6 సంవత్సరాలుగా కిరాణా వ్యాపారం కొనసాగిస్తున్నాడని,కంపెనీలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులను టార్గెట్ గా చేసుకుని ధూల్ పేట్ నుండి ఫరూఖ్ నగర్ కు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ అమ్మకాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. పక్కా సమాచారం మేరకు తరుణ్ జోష్ జైన్ కిరాణా షాపు పై దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచినరూ. 50 వేల విలువ చేసే 500 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు.గంజాయి ఆపరేషన్ లో పాల్గొన్న తమ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి,రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్,సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరిండెంట్ ఉజ్వల రెడ్డి లు అభినందించినట్లు తెలిపారు.



Next Story