- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss Season 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది కామనర్ కాదు.. సెలబ్రిటీ.. పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ సీజన్-9 సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సారి 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లగా.. అందులో ఆరుగురు కామనర్స్.. మిగిలిన తొమ్మిది మంది సెలబ్రిటీలు ఉన్నారు. ఇక ఇప్పటికే సామాన్యులు, సెలబ్రిటీల మధ్య యుద్ధం స్టార్ట్ కాగా.. నామినేషన్స్‌లో ఒకరిపై మరొకరు మాటల యుద్ధమే చేశారు. దీంతో ఈ వారం నామినేషన్‌లో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు. అయితే.. శనివారం ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే ప్రోమోలు కూడా రాగా.. కామనర్స్‌పై నాగార్జున ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. వారం ఇంటి నుంచి బయటకు వచ్చే లిస్ట్‌లో సెలబ్రిటీ ఉండటం విశేషం. ఈ వారం ఇంటి నుంచి శ్రష్ఠి వర్మ బయటకు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.






