అల అయోధ్యాపురిలో.. వీడియో చూశారా?

by Dishanational5 |
అల అయోధ్యాపురిలో.. వీడియో చూశారా?
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. భగవాన్ రామ్ లల్లా అద్భుతమైన నివాసం.. ప్రాణప్రతిష్ఠ వేడుకకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా సాగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆలయానికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. ఆలయ స్తంభాలన్నింటికీ పూలతో అలంకరించారు. కింది భాగంలో లైట్లను అమర్చారు. దీంతో పైన నల్లని ఆకాశం.. కింద శ్వేతవర్ణంలో ఆలయం కాంతులీనుతూ కనులవిందుగా కనిపిస్తోంది. ఆలయం బయటా లోపల గ్రాండ్ పాలరాతితో నిర్మించిన ఫ్లోర్ మెరుస్తూ ఉంది. మొత్తానికి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఒళ్లంతా భక్తిపారవశ్యంతో పులకించిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న(సోమవారం) జరగనున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed