- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్ అయోధ్యలోనే.. ఎన్ని అడుగులో తెలుసా?
by Mallepaka Hamsa |
అయోధ్య రామమందిరం ప్రారంభానికి కొద్ది రోజులే ఉండటంతో హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

X
దిశ, ఫీచర్స్: అయోధ్య రామమందిరం ప్రారంభానికి కొద్ది రోజులే ఉండటంతో హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు, ఆధ్యాత్మిక నాయకులు, వ్యాపారవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దేశంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ స్క్రీట్ అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రారంభ వేడుకను సందర్శకులు కళ్లారా చూడడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆర్తీ ఘూట్‌లో అందుబాటులోకి రానుంది. దీని పొడవు 1100 చదరపు అడుగులు ఉన్నట్లు సమాచారం. దీనిని ఓ ప్రత్యేక బోటుపై విశాఖకు చెందిన 70 మంది కళాకారులు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ విషయం తెలిసిన స్థానికులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Next Story






