- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధరామయ్య పేరులో ‘రామ్’.. ప్రవర్తనలో కాలనేమి
by Shamantha N |
కర్ణాటక సీఎంపై అయోధ్య హనుమాన్ గరి ఆలయ పూజారి విమర్శలు చేశారు. సిద్ధరామయ్య పేరులోనే రామ్ ఉందని.. కానీ ఆయన ప్రవర్థన కాలనేమిలా ఉందని అన్నారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక సీఎంపై అయోధ్యలోని హనుమాన్ గరి ఆలయ పూజారి విమర్శలు చేశారు. సిద్ధరామయ్య పేరులోనే రామ్ ఉందని.. కానీ ఆయన ప్రవర్థన కాలనేమిలా ఉందని అన్నారు. అసురుడు అని అర్థం వచ్చేలా సిద్ధరామయ్యను కాలనేమితో పోల్చారు పూజారి మహంత్ రాజు దాస్. మరోవైపు కర్ణాటక బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నాయకులను విమర్శించారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికను అందిస్తే.. సిద్ధరామయ్య ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. కర్ణాటక బీజేపీ నేతలకు రాముడి గురించి అవసరం లేదు. వారు బాబర్ గురించి ఆందోళన చెందుతారని చురకలు అంటించారు. అఫ్గానిస్థాన్ లోని బాబర్ సమాధి దగ్గర రాహుల్ ఉన్న పాత ఫొటోను షేర్ చేశారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ మూడు తరాల నేతలు బాబర్ సమాధి దగ్గరికి వెళ్లారని గుర్తుచేశారు.
Next Story






