తల, కళ్లు లేకుండా ప్రాణప్రతిష్ఠ ఎలా.. జ్యోతిష్ పీఠం శంకరాచార్య

by Shamantha N |

అయోధ్య రామమందిర ప్రతిష్ఠపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రతిష్ఠకు హాజరైతే గ్రంధాలు ఉల్లంఘించారనే అపవాదు వస్తుందన్నారు స్వామి అవిముక్తేశ్వరానంద్.

తల, కళ్లు లేకుండా ప్రాణప్రతిష్ఠ ఎలా.. జ్యోతిష్ పీఠం శంకరాచార్య
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామమందిర ప్రతిష్ఠపై జ్యోతిష్ పీఠం శంకరాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రతిష్ఠకు హాజరైతే గ్రంధాలు ఉల్లంఘించారనే అపవాదు వస్తుందన్నారు స్వామి అవిముక్తేశ్వరానంద్. రామమందిరం సంపూర్తిగా ఉందని.. మత గ్రంథాలకు విరుద్ధంగా ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఆలయం భగవంతుని శరీరం అని.. ఆలయ శిఖరం దేవుని నేత్రాలకు సూచన, కలశం శిరస్సును సూచిస్తుందన్నారు. గుడిపై ఉన్నా జెండా దేవుడి కేశమని శంకరాచార్యలు వివరించారు. శరీరంలో తల, కళ్లు లేకుండా ప్రాణం నింపడం సరికాన్నారు. గ్రంథాలకు విరుద్ధం అన్నారు. ఒకవేళ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తే తన గురించి మాట్లాడతారన్నారు. ఈ సమస్య గురించి అయోధ్య ట్రస్టు సభ్యులతో మాట్లాడామన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాకే ప్రాణప్రతిష్ఠ చేయాలని చర్చ జరుగుతోందన్నారు. మరోవైపు నలుగురు శంకరాచార్యులు రామాలయ ప్రాణప్రతిష్ఠకు గైర్హాజరు అవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివాదం నడుస్తోంది.

నలుగురు శంకరాచార్యులు ఎవరంటే?

శంకరాచార్యులు అంటే హిందూ గ్రంధాల అత్యున్నత అధికారం. మొత్తం నలుగురు శంకరాచార్యలు ఉన్నారు. ఉత్తరాఖండ్, ఒడిషా,కర్ణాటక, గుజరాత్ ల్లో మఠాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణం పూర్తికాలేదని ఈ నలుగురు శంకరాచార్యులు ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని దాటవేశారు. శంకరాచార్యుల వివరణతో ఆహ్వానాన్ని తిరస్కరించడానికి కాంగ్రెస్ వారి సాకును ఆధారం చేసుకుని ప్రతిష్ఠాపనకు వెళ్లట్లేదని ప్రకటించాయి. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

Next Story