అయోధ్య రామమందిర ఆహ్వానం ఆ ఒక్క సీఎంకే.. ఎవరో తెలుసా..?

by Sathputhe Rajesh |

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

అయోధ్య రామమందిర ఆహ్వానం ఆ ఒక్క సీఎంకే.. ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈనెల 22న జరిగే మహోత్తర ఘట్టానికి ఇప్పటికే రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. సీఎంలలో మాత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాత్రమే ఆహ్వానం అందింది. ఇతర సీఎంలకు ఆహ్వానం అందలేదని రామాలయ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానాలు అందలేదు. రామజన్మ భూమి ఉద్యమం సమయంలో మరణించిన కరసేవకుల కుటుంబాలకు మాత్రం ఆహ్వానాలు అందాయి.

Next Story