అయోధ్య రామాలయంపై వదంతులు.. శంకరాచార్యలు ఏమన్నారంటే?

by Shamantha N |

అయోధ్య రామాలయ ప్రతిష్ఠపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరగట్లేదని ఆరోపిస్తున్నాయి.

అయోధ్య రామాలయంపై వదంతులు.. శంకరాచార్యలు ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయ ప్రతిష్ఠపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరగట్లేదని ఆరోపిస్తున్నాయి. రామాలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయ వేడుకగా చేశారని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఆలయ ప్రారంభోత్సవం నలుగురు శంకరాచార్యుల సలహాలు, మార్గనిర్దేశకం ప్రకారం చేస్తున్నారనా అని ప్రశ్నించింది. మరోవైపు ముగ్గురు శంకరాచార్యులు రాముడి విగ్రహ ప్రతిష్ఠకు మద్దతిస్తూనే.. ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా గళం విప్పారు.

పూరీ గోవర్ధన్ మఠానికి చెందిన శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి, రామాలయానికి సంబంధించిన ఆచారాలు "గ్రంధాలకు విరుద్ధం" అని ప్రకటించారు. అందుకే రామమందిర ప్రతిష్ఠకు హాజరు కానని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రామమందిరానికి వ్యతిరేకం కాదని.. తన స్థానం, గౌరవం గురించి తనకు స్పృహ ఉందని.. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాముడి ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరగాలని.. అయోధ్య కార్యక్రమానికి వెళ్లి తాను ఏం చేస్తానని అన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

జ్యోతిర్ మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి మాట్లాడుతూ ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆచారాలు శాస్త్రాల ప్రకారం పాటించడం లేదని అన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముందు ఆలయ నిర్వహణను రామానంద్ వర్గానికి అప్పగించాలని అన్నారు. రామాలయం వైష్ణవశాఖకు చెందిన రామానంద సంప్రదాయానికి చెందినదని.. సన్యాసులు, శైవ, శక్తి వర్గాలకు చెందినది కాదని చంపత్ రాయ్ చెప్పడం వివాదానికి దారితీసింది. మరోవైపు ఆలయం నిర్మాణంలో ఉండగానే విగ్రహ ప్రతిష్ఠాపన శాస్త్రవిరుద్ధం అని ప్రస్తావించారు స్వామి అవిముక్తేశ్వరానంద.

శంకరాచార్యలు ఏమన్నారంటే?

మరోవైపు శంకరాచార్యులు రామాలయ ప్రతిష్ఠపై వ్యాఖ్యలు చేసినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారికి అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం సంతోషకరమైన విషయం అని అన్నారు. అయోధ్య కార్యక్రమాన్ని వ్యతిరేకించలేదని.. తప్పుడు ప్రచారాలకు ప్రాధాన్యత ఇవ్వద్దని స్పష్టం చేశారు.

Next Story