- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ మహోత్సవ సన్నాహక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా అయోధ్యలో 108 అడుగుల ఎత్తైన అగరవత్తిని వెలిగించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్ అగరవత్తిని వెలిగించారు. గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ అగరవత్తిని జై శ్రీరామ్ నామస్మరణల మధ్య వెలిగించారు. దాదాపు 3 వేల 610 కిలోల బరువు, మూడున్నర అడుగుల వెడల్పు ఉంది. అగరవత్తి నుంచి వెలువడే సువాసన దాదాపు 50 కిలోమీటర్ల మేర వ్యాపిస్తుందని తయారీ దారులు చెప్తున్నారు. ఆవుపేడ, నెయ్యి, పూలు, మూలికలు, సుగంధద్రవ్యాలతో అగరవత్తినీ తయారు చేశారు. దీన్ని ఒక్కసారి వెలిగిస్తే నెలన్నరపాటు మండుతుంది. దీని తయారీకి ఆరునెలలకు పైగా సమయం పట్టిందన్నారు తయారీదారులు.
Next Story






