EV: మీ లవర్‌తో లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లడం ఇష్టమా? మీ కోసమే ఈ స్పెషల్‌ బైక్‌.. ఒకసారి ఛార్జ్ చేస్తే 130కిలోమీటర్లు రయ్‌ రయ్!

by Vennela |

EV: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీలకు కొదవేలేదు. కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదలవుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

EV: మీ లవర్‌తో లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లడం ఇష్టమా? మీ కోసమే ఈ స్పెషల్‌ బైక్‌.. ఒకసారి ఛార్జ్ చేస్తే 130కిలోమీటర్లు రయ్‌ రయ్!
X

దిశ, వెబ్ డెస్క్: EV: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీలకు కొదవేలేదు. కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదలవుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఈ స్కూటర్స్ లో ఒకటి వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500వాట్. గత ఏడాది మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఈవీ స్టైల్ తోపాటు చక్కటి రేంజ్ కెపాసిటిని కలిగి ఉంది. ఒక కొత్తగా ఒక ఈ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ మోడల్ మంచి ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 వాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గత ఏడాది తొలినాళ్లలో ఈ విలోసిఫెరో అనే ఇటాలియన్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సంస్థ ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ప్రవేశించింది. ప్రొడక్షన్ సేల్స్ కోసం కేఏడబ్ల్యూ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక విఎల్ఎఫ్ టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ప్రపంచవ్యాప్తంగా 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే భారత మార్కెట్లో 1500 వాట్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లోని ప్లాంట్లో ఈ స్కూటర్ని స్థానికంగా తయారు చేస్తున్నారు. వీఎల్ఎఫ్ ఇప్పుడు భారత మార్కెట్లో తన ఉత్పత్తులను తయారు చేస్తున్న రెండవ ఇటాలియన్ టూ వీలర్ వెహికల్ బ్రాండ్ అప్రిలియాకు బారమతిలో తయారీ సౌకర్యం ఉంది.

భారతదేశంలో విస్తృతమైన నెట్వర్క్ ని నిర్మించే లక్ష్యంతో బిఎల్ఎఫ్ టైర్ 1, టైర్ 2 నగరాలలో డీలర్ షిప్స్ ను ఏర్పాటు చేయడంపై మరింత ఫోకస్ చేసింది. ఇక ఈ వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 వాట్ ఈ స్కూటర్ స్నో ఫ్లేక్ వైట్, ఫైర్ ప్యూరీ డార్క్ రెడ్, స్లేట్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది. 1500 వాట్స్ మోటార్ 2.0 కిలోవాట్ల బ్యాటరీకి లింక్ చేసి ఉంటుంది. ఈ యూనిట్ 157 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 వాట్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది. పూర్తి చార్జింగ్ కు 3 గంటల సమయం పడుతుందని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమవుతున్న 4000 వాట్ వేరియంట్ గరిష్టంగా 232 ఎంఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకెళ్తుంది. 2.8 కిలోమీటర్ల బ్యాటరీ అమర్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యేందుకు ఐదు నుంచి 6 గంటల సమయం పడుతుంది.

హై-టెన్సిల్ స్టీల్ ఫ్రేమ్ పై ఉండే ఈ వీఎల్ఎఫ్ టెన్నిస్ 1500 వాట్ బ్యాటరీతో 88కిలోల బరువు మాత్రమే ఉంటుంది. గ్లోబల్ స్పెక్ టెన్నిస్ 4000 వాట్ బరువు 10కిలోలు ఎక్కువ. 1500 వాట్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్ సైడ్ లో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ లో హైడ్రాలిక్ మోనో షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. వీఎల్ఎఫ్ టెన్నిస్ స్పీడోమీటర్ కోసం 5 ఇంచ్ డిజిటల్ టీఎఫ్టీ డిస్ ప్లేను అమర్చారు. ఇది రైడర్ కు ఎకో, కంఫర్ట్ , స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ను అందిస్తుంది. ఇది 12 ఇంచ్ వీల్స్ పై ప్రయాణిస్తుంది. రెండు వైపులా ఎల్ఈడీ యూనిట్లను అమర్చారు. ఈ ఈ స్కూటర్ ధర రూ. 1.30లక్షలుగా ఉంది.

Next Story