- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EV: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ కంపెనీ బైక్స్‌పై భారీ డిస్కౌంట్లు!
EV: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేసేవారికి గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్: EV: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేసేవారికి గుడ్ న్యూస్. కొత్త వీడా వీ2, వీడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు అప్ గ్రేడ్ వెర్షన్ పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ ద్వారా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 4వేల వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు వీడా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ షాపింగ్ వెబ్ సైట్లు బ్యాంక్ డిస్కౌంట్లు, ఈఎంఐలు, క్యాష్ బ్యాక్, జీఎస్టీ ప్రయోజనాలను అందిస్తున్నాయి. వీడా వీ2 లైట్ ఈ సిరీస్ లో అత్యంత తక్కువ ధరలో లభించే ఎంపిక. 2.2kwhబ్యాటరీతో వస్తోంది. ఇది ఫుల్ ఛార్జీతో 94కి.మీ రేంజ్ ను అందిస్తుంది. ఈ మోడల్ వీడా లైన్ ఆప్ కు కొత్తగా చేరింది
వీడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లస్, ప్రో వెర్షన్లలో కూడా లభిస్తుంది. వీ2 లైట్ గరిష్ట వేగం గంటకు 69కి.మీగా ఉంది. రైడ్, ఈకో అనే రెండు రైడింగ్ మోడ్స్ ను కలిగిఉంది. దీని స్పెసిఫికేషన్లు 7 అంగుళాల టీఎప్టీ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో సహా ఖరీదైన మోడళ్లతో సమానంగా ఉన్నాయి. వీ2 ప్లస్ 3.44kwh పెద్ద బ్యాటరీతో 143 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. వీ2 ప్రో 3.94 kwhబ్యాటరీతో ఒకే ఛార్జీతో 165 కి.మీ. గరిష్ట రేంజ్ ను అందిస్తుంది. వీ2 సిరీస్ లోని రెండు మోడళ్లు డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్స్ ను కలిగి ఉంటాయి. వీటిని సుమారు 6గంటల్లో 80శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
వీడా వీ2 స్వింగ్ ఆర్మ్ పై అమర్చిన పీఎంఎస్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 6కేడబ్ల్యూ ఉత్పత్తి చేస్తుంది. 26ఎన్ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది. వీ2 ప్లస్, ప్రో మోడల్స్ నాలుగు రైడింగ్ మోడ్స్ ను కలిగి ఉంటాయి. ఈకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్. వీ2ప్లస్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ కాగా వీ2 ప్రో వేగం గంటకు 90కి.మీగా ఉంది. డిజైన్ విషయంలో వీడా వీ2 ఇప్పుడున్న వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను పోలి ఉంటుంది. అయితే ఇది రెండు కొత్త రంగుల్లో వస్తుంది. మ్యాట్ నెక్సస్ బ్లూ గ్రే, అలాగే గ్లాసీ స్పోర్ట్స్ రెడ్ లలో కూడా లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 5ఏళ్లు లేదా 50,000కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో వస్తుంది. బ్యాటరీ ప్యాక్స్ 3ఏళ్లు లేదా 30,000కిలోమీటర్ల వారంటీతో వస్తుంది.
క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఇంకా అదనపు ఫంక్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 250కంటే ఎక్కువ నగరాల్లో ఉన్న 3,100 ఛార్జింగ్ స్టేషన్ల నెట్ వర్క్ ను వీ2 యూజర్లు యాక్సెస్ చేయవచ్చని హీరో కంపెనీ తెలిపింది.






