Electric Scooter: మార్కెట్‌లోకి హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు దూసుకెళ్తుందో తెలుసా?

by Vennela |

High-tech electric scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Scooter)కు ఆదరణ పెరుగుతోంది.

Electric Scooter: మార్కెట్‌లోకి  హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు దూసుకెళ్తుందో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: High-tech electric scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Scooter)కు ఆదరణ పెరుగుతోంది. వినియోగదారులకు అభిరుచికి తగ్గట్లుగా కంపెనీలు కూడా రకరకాల మోడల్స్ ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటి పలు ప్రముఖ కంపెనీలను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటికి వినియోగదారుల నుంచి మచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇప్పుడు అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌(Ultraviolet Automotive Tesseract Electric Scooter)ను విడుదల చేసింది . దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్), కానీ మొదటి 10,000 మంది కస్టమర్లకు కేవలం రూ. 1.20 లక్షలకే లభిస్తుంది. దాని ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం.

అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ టెస్సెరాక్ట్ స్కూటర్ (Ultraviolet Automotive Tesseract Electric Scooter) 261 కి.మీ వరకు అద్భుతమైన IDC పరిధిని కలిగి ఉంటుంది . ఈ ఇ-స్కూటర్ (Electric Scooter)కేవలం 2.9 సెకన్లలోనే గంటకు 0-60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీనికి 3.5kWh, 5kWh, 6kWh అనే మూడు బ్యాటరీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. హెల్మెట్ పట్టేందుకు సీటు కింద స్టోరేజీ కూడా ఉంటుంది. అల్ట్రావయోలెట్ ((Ultraviolet Automotive)టెస్రాక్ట్ నెక్ట్స్ జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. ఇది భారతదేశంలోని అత్యంత హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల(High-tech electric scooter)లో ఒకటిగా నిలిచింది. ఇది డ్యూయల్-రాడార్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాలు కూడా ఉన్నాయి. అంతేకాదు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇక డిజైన్ పరంగా చూసినట్లయితే.. ఈ స్కూటర్ డ్యూయల్ LED-ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లోటింగ్ DRLలు, పెద్ద TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వైలెట్ AI కనెక్టివిటీ సూట్, రైడ్ అనలిటిక్స్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో కూడిన పర్ఫెక్ట్ స్మార్ట్ స్కూటర్ అని చెప్పవచ్చు.టెస్రాక్ట్ పవర్ ఫుల్ మాత్రమే కాదు.. సూపర్ స్మార్ట్ కూడా. ఇది కీలెస్ యాక్సెస్, పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్, మ్యూజిక్ కంట్రోల్, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. టెస్సెరాక్ట్ డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో వస్తుంది. ఇది 14-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. ఈ బైకులో బ్రేకింగ్‌ సిస్టమ్ అద్బుతంగా పనిచేస్తుంది.

టెస్సెరాక్ట్ లుక్స్ విషయంలో కంపెనీ ఎక్కడా కూడా రాజీపడలేదు. అల్ట్రావయోలెట్(Ultraviolet) దీనిని డెజర్ట్ సాండ్, సోనిక్ పింక్, స్టీల్త్ బ్లాక్ వంటి అద్భుతమైన కలర్స్ ఆప్షన్స్ లో ఇంట్రడ్యూస్ చేసింది. బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. డెలివరీలు 2026 మొదటి త్రైమాసికం నుండి ప్రారంభమవుతాయి. మీరు ఈ ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే, మీ బడ్జెట్‌ లోపే ఉండే అవకాశం ఉంది.

Next Story