- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TVS Apache: TVS అపాచి దూకుడు.. ఏ జనరేషన్‌లోనైనా కింగ్ కింగే..20ఏళ్లలో ఎన్ని లక్షల అమ్మకాలంటే?
TVS Apache: టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రధాన మోటార్ సైకిల్ బ్రాండ్ అపాచీతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: TVS Apache: టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రధాన మోటార్ సైకిల్ బ్రాండ్ అపాచీతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అపాచీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల అమ్మకాల రికార్డును సాధించింది.
టీవీఎస్ అపాచీ బ్రాండ్‌లో 160 సిసి నుండి 310 సిసి వరకు ఆరు మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. 60 కి పైగా దేశాలలో అమ్ముడవుతున్నాయి. అపాచీ బైకులను ప్రవేశపెట్టిన 20ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ టీవీఎస్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2005లో టీవీఎస్ అపాజీ 150 పేరుతో తొలి బైక్ ను లాంచ్ చేసింది. అప్పటి నుంచి బైక్ పనితీరులో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ..అధునాతన ఫీచర్లను ఎప్పటికప్పుడూ అందిస్తూ వచ్చింది.
అచాచీ ఆర్టీఆర్, అపాచీ ఆర్ఆర్, సిరీస్ బైకులను పరిచయం చేసింది. అత్యాధునిక రేసింగ్ టెక్నాలజీతో ఈ బైకులను తీసుకువచ్చింది. వీటిలో ఫ్యూయల్ ఇంజక్షన్, మల్టిపుల్ రైడ్ మోడ్స్, అడ్జెస్టబుల్ సస్పెన్షన్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్స్ ను జోడించింది. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ సదుపాయాలను అందించింది.
పలు మోడళ్లలో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి సాంకేతికతను తీసుకువచ్చింది. భారత్ సహా కొలంబియా, బంగ్లాదేశ్, నేపాల్, మెక్సికో, ఆఫ్రికాతోపాటు 60కిపైగా దేశాల్లో అపాచీ బైకులను విక్రయిస్తోంది. ఇటీవల ఇటలీతోపాటు యూరప్ లోని మరిన్ని దేశాల్లో విక్రయాలను ప్రారంభించింది. అపాచీ ఈ మైలు రాయిని చేరుకోవడంపై టీవీఎస్ మోటార్ ఎండీ సుదర్శన్ వేణు ఆనందం వ్యక్తం చేశారు.






