- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Electric Scooter: చీప్ అండ్ బెస్ట్.. ఫీచర్స్ అదుర్స్.. ఈ హై మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటీ గురించి తెలుసా?
Electric Scooter: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ(Simple Energy) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) ను రిలీజ్ చేసింది.

దిశ, వెబ్డెస్క్: Electric Scooter: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ(Simple Energy) కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) ను రిలీజ్ చేసింది. ఇది సింపుల్ వన్(Simple Energy) అప్ డేట్ వెర్షన్ తో వచ్చిన కంపెనీ ఫ్లాగ్ షిప్ స్కూటర్. సింపుల్ ఎనర్జీ దీన్ని కొత్త సాఫ్ట్ వేర్, కొత్త డిజైన్ తో రూపొందించింది. అంతేకాదు మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ టూ వీలర్స్(Made in India Electric Two Wheelers) అందించే వాటిలో అత్యధిక రేంజ్ తో దీన్ని విడుదల చేసింది. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్న వివరాలు తెలుసుకుందాం.
ఈ కొత్త స్కూటర్ పేరు వన్ జెన్ 1.5(One Gen 1.5). కంపెనీ దీన్ని 248 కిలోమీటర్ల రేంజ్ తో తీసుకువచ్చింది. ఇది ప్రీవియస్ మోడల్ కంటే 36కిలోమీటర్లు ఎక్కువ అని పేర్కొంది. మేడ్ ఇన్ ఇండియా(Made in India) ఎలక్ట్రిక్ టూ వీలర్ అందించే వాటిలో అత్యధిక రేంజ్ ఇదే. ఇక కంపెనీ దీని ప్రీవియస్ మోడల్ ను అంటే సింపుల్ వన్ జెన్ 1 స్కూటర్ లో 212 కిలోమీటర్ల రేంజ్ ను అందించినట్లు పేర్కొంది.
ఇక ఫీచర్ల(Features) విషయానికి వస్తే ఈ కొత్త సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్ లో కంపెనీ ఎన్నో కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. దీనిలో బ్లూటూత్, కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ నోటిఫికేషన్స్ ను అందించే యాప్ ఇంటిగ్రేషన్ తో పాటు నావిగేషన్, ఓటీఏ అప్ డేట్స్, ఆటో బ్రైట్ నెస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కొత్త రైడ్ మోడ్స్, పార్క్ అసిస్టెంట్ ఫీచర్, ఫైండ్ మై వెహికల్ ఫీచర్లు, రీజనరేటివ్ బ్రేకింగ్, ర్యాపిడ్ బ్రేక్ , డ్యాష్ థీమ్, ట్రిప్ హిస్టరీ అండ్ స్టాటిస్టిక్స్ , యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అండ్ సౌండ్ వంటి స్పెషల్ ఫీచర్లు(Special features) ఇందులో ఉన్నాయి.
ఈ సింపుల్ వన్ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్(Simple One Gen 1.5 Electric Scooter) మోటార్ 8.5కేడబ్ల్యూ పవర్, 72ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది. దీంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.77సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని సింపుల్ ఎనర్జీ సంస్థ తెలిపింది. ఇది 30 లీటర్ల కంటే ఎక్కువ బూస్ట్ స్పేస్ అంటే సీటు లోపల ఖాళీ స్థలాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల కంపెనీ దీన్ని క్లాస్ బూట్ స్పేస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో అత్యుత్తమైందిగా పేర్కొంది.
ఈ స్కూటర్ లో కంపెనీ ఇచ్చిన బ్యాటరీ సెటప్ లో ఫిక్స్డ్ 3.7kWh బ్యాటరీ ప్యాక్, 1.2kWh రిమూవబుల్ బ్యాటరీ వచ్చింది. అయితే స్కూటీ రేంజ్ ను పెంచేందుకు వినియోగదారులు సాఫ్ట్ వేర్ తో ఈ రెండు బ్యాటరీలను ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ఈ స్కూటర్ లో 7 అంగుళాల డిజిటల్ డిస్ల్పే, ఎల్ఈడీ లైటింగ్ సదుపాయం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.66లక్షలుగా ఉంది. ఇది ఓలా, ప్రొజెన్, ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.






