- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేవలం రూ.12వేలకే మోటరోలా ఎడ్జ్ 60.. వాటర్ రెసిస్టెంట్ సహా అదిరిపోయే ఫీచర్లు ఇవే!
మోటరోలా ఎడ్జ్ మోడల్‌లో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటరోలా తీసుకువచ్చిన బెస్ట్ మోడల్స్‌లో ఎడ్జ్ 60 ఫ్యూషన్ కూడా ఒకటి.

దిశ, వెబ్ డెస్క్: మోటరోలా ఎడ్జ్ మోడల్‌లో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మోటరోలా తీసుకువచ్చిన బెస్ట్ మోడల్స్‌లో ఎడ్జ్ 60 ఫ్యూషన్ కూడా ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఎప్రిల్ 2025లో లాంఛ్ చేశారు. దీని అసలు ధర రూ.22,999 కాగా ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లికార్ట్‌లో కేవలం రూ.12వేలకే వస్తోంది. అయితే దానికి కొంత ప్రాసెస్ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఫ్లిప్ కార్ట్‌లో ఎడ్జ్ 60 ఫ్యూషన్ పై డిస్కౌంట్ మరియు లిమిటెడ్ పీరియడ్ ఎక్స్ చేంజ్ ఆఫర్ నడుస్తోంది. ఈ ఫోన్ కొనాలనుకునేవారు యాక్సెయ్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రూ.2000 వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది.
ఇక దీంతో పాటూ ఫోన్ ఎక్స్ చేంజ్ ద్వారా మరో రూ.10వేల వరకు తగ్గుతుంది. ఉదాహరణకు మీరు రియల్ మీ 11ప్రో ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసినట్లయితే దాదాపు రూ.9వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఎడ్జ్ 60 ఫ్యూషన్ కేవలం రూ.12లకే లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కాబట్టి ఇప్పుడే త్వరపడండి. ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇంత తక్కువ ధరలో మరే ఫోన్‌లో కూడా ఎడ్జ్ డిస్ ప్లే లభించడం లేదు. అంతే కాకుండా వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కాబట్టి వర్షాకాలంలో వాన చినుకుల నుండి ఫోన్‌ను రక్షించుకోవచ్చు.
అదే విధంగా డిస్‌ప్లే చూసినట్లయితే కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐతో వస్తోంది. ఈ డిస్ ప్లే గీతలు పడకుండా స్క్రాచ్ రెసిస్టెంట్‌తో తయారు చేశారు. ఇక ఈ ఫోన్ 50 మెగాపిక్సల్ సోని లిథియా మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో వచ్చింది. అదే విధంగా 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 15 ప్రాసెసర్ విత్ ఏఐ ఫీచర్స్‌తో దీని ప్రాసెసర్ తయారు చేశారు. అంతే కాకుండా 6.67 ఇంచులతో 1.5కే క్వాడ్ కర్వ్డ్ ఆల్మండ్ స్కీన్‌తో ఈ స్మార్ట్ ఫోన్ స్టైలిష్ లుక్‌లో డిజైన్ చేశారు. 12 జీబీ ర్యామ్ మరియు 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఈ ఫోన్‌లో ఇస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే ఫాస్ట్ చార్జింగ్‌తో ఏ 5,500 mAh బ్యాటరీ ఉంది. 20వేల లోపు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలని అనుకుంటే ఎక్స్‌చేంజ్‌లో ఇది మంచి ఆప్షన్.






