- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maruti Fronx: రూ. 7.52 లక్షలు.. ఆ కారుపై సూపర్ డూపర్ డిస్కౌంట్!
Maruti Fronx: భారత్ లో అగ్రశ్రేణి కార్ల తయారీదారులు తమ కార్లను ఆకట్టుకునే ఆఫర్లతో పాటు పలు రకాల డిస్కౌంట్లలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: Maruti Fronx: భారత్ లో అగ్రశ్రేణి కార్ల తయారీదారులు తమ కార్లను ఆకట్టుకునే ఆఫర్లతో పాటు పలు రకాల డిస్కౌంట్లలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విభాగంలో అగ్రగామిగా నిలిచిన మారుతీ సుజుకి కూడా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మారుతీ కంపెనీకి సంబంధించిన దాని హాట్ సెల్లింగ్ మోడల్స్ లో ఒకటైన ఫ్రాంక్స్ కారుపై అదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. మారుతీ ఫ్రాంక్స్ మోడల్ పై మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. వివరాల ప్రకారం మారుతీ బ్రాండ్ ఫ్రాంక్స్ కారుపై దాదాపు లక్ష రూపాయలకు ప్రయోజనాలను అందిస్తోంది.
ఫ్రాంక్స్ కారుపై ప్రకటించిన రూ. లక్ష డిస్కౌంట్స్ లో రూ. 35,000 విలువైన నగదు డిస్కౌంట్ రూ. 43,000విలువైన వెలాసిటీ కిట్ యాక్సెసరీ ప్యాకేజీ రూ. 15,000 స్క్రాపేజ్ ప్రయోజనం రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. ఈ ఆఫర్ ప్రస్తుతానికి ఏప్రిల్ నెల వరకు చెల్లుతుంది.అయితే ఈ ఆఫర్ స్టాక్ ను బట్టి ఉంటుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు సంబంధిత వివరాలను పొందేందుకు సమీపంలోని అధీక్రుత డీలర్ షిప్ ను సందర్శించాలని మారుతీ ప్రతినిధులు చెబుతున్నారు. మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 7.52 లక్షలుగా, టాప్ మోడల్ రూ. 12. 88 లక్షల వరకు ఉంటుంది.
మారుతీ ఫ్రాంక్స్ కారు 10 కంటే ఎక్కువ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. కస్టమర్లకు నచ్చిన విధంగా ఫుట్ ట్రిమ్ ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు ఈ కారులో రెండు పెట్రోల, 1 సీఎన్జీ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారు మ్యూనువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అలాగే మైలేజ్ విషయానికోస్తే ఈ మోడల్ ట్రిమ్ ను బట్టి 20.01 నుంచి 22.89 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.






