- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదిరిపోయే ఫీచర్లతో కియా నుంచి కరెన్స్ క్లావిస్ విడుదల.. ధర ఎంతంటే?
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మరో కొత్త కారును భారత మార్కెట్లో విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia) మరో కొత్త కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. కుటుంబ ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారుల కోసం గతంలో కియా కరెన్స్ మోడల్ కారును తీసుకొచ్చింది. ఇది మంచి ఫ్యామిలీ కారుగా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో అదిరిపోయే అత్యాధునిక ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్స్‌తో కరెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) మోడల్‌ను తీసుకొచ్చింది. ఇక దీని ప్రారంభ ధర రూ.11.50 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించింది. ఇది 7 వేరియంట్లలో ప్రారంభించారు. టాప్ వేరియంట్‌కు రూ. 21.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
కియా కరెన్స్ క్లావిస్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 113 హెచ్‌పీ పవర్‌ను, 143.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 157 హెచ్‌పీ పవర్‌ను, 253 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 హెచ్‌పీ పవర్‌ను 250 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. అలాగే, ఆరు, ఏడు సీట్ల లేఅవుట్లలో లభిస్తుండటం వల్ల, చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాల వరకు సరిపడే విధంగా ఉంటుంది. డిజైన్ పరంగా కాస్త స్పోర్టీ టచ్‌తో ముందువైపు పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, వీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్డ్ ఆఫ్ గ్రిల్‌తో డిజైన్ చేశారు. పనోరమిక్ సన్‌రూఫ్, స్పోర్టీ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో మరింత ఆకట్టుకునే లుక్‌తో దీన్ని తీసుకొచ్చారు.
ఇక ఇంటీరియర్ విషయానికొస్తే.. 22.62-అంగుళాల డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఉంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, 10.25 అంగుళాల టచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉన్నాయి. వైర్లెస్ ఛార్జర్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్రైవ్ మోడ్లు (ఎకో, నార్మల్, స్పోర్ట్), ప్యాడిల్ షిఫ్టర్లు (DCT ఎక్స్‌క్లూజివ్), రెండవ, మూడవ వరుసల కోసం AC వెంట్స్, USB పోర్ట్‌లు, కో-డ్రైవర్ సీటు కోసం బాస్ మోడ్ (హ్యుందాయ్ అల్కాజార్ లాగా ), రెండవ వరుసలోని ఎడమ వైపు సీటు కోసం వన్-టచ్-టంబుల్-ప్లస్-ఫోల్డ్ ఫీచర్ ఉన్నాయి. అలాగే కరెన్స్ క్లావిస్లో 20కి పైగా భద్రతాపరమైన లెవెల్-2 అడాస్ ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఫ్రంట్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్ వంటి అధునాతన ఫీచర్లను క్లావిస్‌కు జోడించారు.






