80శాతం మహిళలు దానికోసమే వాట్సాప్, ఇన్ స్టా వాడుతున్నారు.. మెటా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

by Ajay Maddhiboyina |

ఇండియాలో 80శాతం మంది మ‌హిళ‌లు ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగిస్తున్నారని తమ అధ్యయనంలో తేలినట్టు మెటా పేర్కొంది.

80శాతం మహిళలు దానికోసమే వాట్సాప్, ఇన్ స్టా వాడుతున్నారు.. మెటా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియాలో 80శాతం మంది మ‌హిళ‌లు ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగిస్తున్నారని తమ అధ్యయనంలో తేలినట్టు మెటా పేర్కొంది. అంతే కాకుండా 53శాతం మంది మహిళలు ఫేస్ బుక్ పై ఆధారపడుతున్నట్టు తెలిపింది. ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, కోల్ కతాకు చెందిన 25 నుండి 45 మధ్య వయసు కలిగిన 2వేల మందిపై సర్వే నిర్వహించినట్టు పేర్కొంది. ఈ సర్వేలో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునేందుకు ఇన్ స్టా, వాట్సాప్ వినియోగిస్తున్నారని తెలిపింది.

అదే విధంగా షార్ట్ రీల్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లాంటి అంశాలను తెలుసుకుంటారని పేర్కొంది. వస్తువుల కొనుగోలులో మెటా ప్లాట్ ఫారమ్‌ల పాత్ర పెరుగుతున్నా, స్వతంత్ర ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నా, సోషల్ మీడియా వాడే మహిళల సంఖ్య పెరుగుతున్నా ఈ అధ్యయనం ఆర్థిక ఉత్పత్తులను ఎలా కనుగొంటారు, ఎలా కొనుగోలు చేస్తారు అనే దాని గురించి అనేక అపోహలను తొలగిస్తుందని మెటా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా డైరెక్టర్ శ్వేతా బాజ్ పాయ్ అన్నారు.

Next Story