Electric Car: ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్.. ఆ కారు పై అదిరే ఆఫర్

by Vennela |

Electric Car: ఎలక్ట్రిక్ కారు కొనాలని చూసేవారికి శుభవార్త.

Electric Car: ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్.. ఆ కారు పై అదిరే ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: Electric Car: ఎలక్ట్రిక్ కారు కొనాలని చూసేవారికి శుభవార్త. ఎందుకంటే హ్యుందాయ్ క్రెటా ఈవీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో దీనిని ఒక ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. దేశీయ మార్కెట్లోనూ ఎలక్ట్రిక్ క్రెటా ఎస్ యూవీ సంచలనం రేపుతోంది. కొత్త హ్యుందాయ్ క్రెటా అనేది అనేక ఫీచర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ కారు. ఇది సిటీ డ్రైవ్ లకు, లాంగ్ డ్రైవ్ లకు రెండింటికీ బెస్ట్ ఆప్షన్. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తిగా ఛార్జ్ తో చాలా దూరం ప్రయాణించవచ్చు. హ్యుందాయ్ క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ లో వస్తుంది. దీని మొదటి 42కేడబ్ల్యూహెచ్ ప్యాక్ ఒక్కసారి ఛార్జీ చేస్తే 390 కిలోమీటర్ల రేంజ్ వరకు వస్తుంది. అదే సమయంలో 51.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఒకేసారి ఛార్జీ చేస్తే 473 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ క్రెటా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగి ఉంది. ఈ కారు 58 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. అదే సమయంలో మీరు ఇంట్లో 11కేడబ్య్లూ ఏసీ ఛార్జర్ ను ఉపయోగిస్తే బ్యాటరీని 4 నుంచి 4.5గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇదే కాదు హ్యుందాయ్ తన మై హ్యుందాయ్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా 10000కి పైగా ఛార్జింగ్ పాయింట్లను అందిస్తోంది. ఇది ప్రయాణాన్ని మరింత సులభం చేస్తుంది. క్రెటా ఈవీలో v2l టెక్నాలజీ అందుబాటులో ఉంది. తద్వారా ప్రయాణ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను సులభంగా ఛార్జీ చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లో ఈ ఎస్ యూవీ ధర రూ. 17.99లక్షల నుంచి రూ. 24.37 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ఉంటుంది. ఈ కారు ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ వంటి 4 వేర్వేరు వేరియంట్లలో కొనవచ్చు. కంపెనీ తన బ్యాటరీపై 8ఏళ్లుగా లేదా 1.6లక్షల కిలోమీటర్ల వారంటీని కూడా అందిస్తోంది. క్రెటా ఈవీలో సౌకర్యం, సేఫ్టీ కూడా బాగుంది. ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ప్లే 8 వే పవర్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, డిజిటల్ కీ, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను అందిస్తుంది.

ఇక సేఫ్టీ కోసం ఇది 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఈబీడీతో ఏబీఎస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

Next Story