- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Honda Activa 7G: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది..మైలేజీ, ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే
Honda Activa 7G: ప్రస్తుతం భారత్ లో బైకులకు సమానాంగా స్కూటీల అమ్మకాలు జరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Honda Activa 7G: ప్రస్తుతం భారత్ లో బైకులకు సమానాంగా స్కూటీల అమ్మకాలు జరుగుతున్నాయి. స్కూటీల అమ్మకాల్లో టీవీఎస్, హోండాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. టీవీఎస్ జూపిటర్ 110ని విడుదల చేయగా..యాక్టివా 7జీని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. హోండా కంపెనీ ఇది వరకే 4జీ, 5జీ, 6జీ స్కూటీలను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో 7జీని మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం Activa 6G భారతదేశంలో బాగా అమ్ముడవుతోంది. రాబోయే యాక్టివా 7G ధర, ఫీచర్లు , లాంచ్ తేదీ గురించి తెలుసుకుందాం.
మీడియా నివేదికల ప్రకారం, కొత్త హోండా యాక్టివా 7G డిజైన్‌ను అప్ డేట్ చేయవచ్చు. ఇది ప్రస్తుత మోడల్ కంటే మరింత కాంపాక్ట్.. సొగసైనదిగా ఉంటుంది. దాని ముందు నుండి వెనుక వరకు, కొత్త హెడ్‌లైట్లు, DRL, రిఫ్లెక్టివ్ లైట్లను దాని ముందు భాగంలో అందించవచ్చు. కొత్త యాక్టివా 7G సీటు కింద ఇప్పుడు ఎక్కువ స్థలం ఉంది. తద్వారా రెండు పెద్ద హెల్మెట్‌లను ఉంచుకోవచ్చు. వెనుక కూర్చున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా దీని సీటు పొడవుగా ఉంటుంది.
ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, కొత్త యాక్టివా 7G లో 7.6bhp, 8.8Nm టార్క్ ఉత్పత్తి చేసే అప్ డేట్ చేసిన 109cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఇంజిన్ స్టార్ట్-స్టాప్ స్విచ్ బటన్ అందుబాటులో ఉంటుంది. ఇది సైలెంట్ స్టార్టర్, డ్యూయల్-ఫంక్షన్ స్విచ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ లీటరు ఇంధనంతో 50-55 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ప్రస్తుత యాక్టివా లీటరు ఇంధనానికి 45 నుండి 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. స్కూటర్‌లో 5.3-లీటర్ ఇంధన ట్యాంక్ ఉండే అవకాశం ఉంది.
కాగా హోండా యాక్టివా 7G, జూపిటర్ 110 తో నేరుగా పోటీ పడనుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,700 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వచ్చే కొత్త 113.3cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 5.9kw పవర్, 9.8 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి CVT గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ఈ స్కూటర్ మైలేజ్ ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు.






