- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FLYING BIKE: ఎగిరే బైకులు వచ్చేస్తున్నాయి.. ఇక నదులు కూడా ఈజీగా దాటయేవచ్చు
FLYING BIKE: ప్రస్తుతం రోడ్లపైన ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటున్నాయో చెప్పాల్సిన అవసరంలేదు.

దిశ, వెబ్ డెస్క్: FLYING BIKE: ప్రస్తుతం రోడ్లపైన ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటున్నాయో చెప్పాల్సిన అవసరంలేదు. ఒక్కచోట ట్రాఫిక్ జామ్ అయితే రోజుల తరబడి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. నేటి బిజీలైఫ్ లో ప్రతి ఒక్కరూ గమ్యాలను త్వరగా చేరుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్ వచ్చేస్తోంది. మీరు ట్రాఫిక్ జామ్ లో ఇబ్బంది పడుతుంటే గాలిలో ఎగురుతూ ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లాలనుకుంటే ఇంతకంటే మరో ఆప్షన్ లేదనే చెప్పవచ్చు. రోడ్లే కాదు..నదులు, సముద్రాలపై కూడా ఎగురుతుంది.
మీరు ఇప్పటి వరకు ఎగిరే కార్ల గురించి మాత్రమే విని ఉంటారు. కానీ ఇప్పుడు ఎగిరే కార్లు మాత్రమే కాదు.. ఫ్లయింగ్ బైకులు కూడా వచ్చేస్తున్నాయ్. ప్రపంచంలోనే ఎగిరే బైకులను చైనా ఇ మొబిలిటి బ్రాండ్ కుయిక్ వీల్ కంపెనీ దీన్ని రూపొందించింది. త్వరలోనే ఈ బైకును కంపెనీ విక్రయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ బైక్ పేరు రిక్టర్ ద్వారా స్కైరైడర్ X1( Skyrider X1 by Rictor). KUICKWHEEL చే ఇంక్యుబేట్ చేసిన అంతర్జాతీయ బ్రాండ్ అయిన RICTOR, స్మార్ట్ మొబిలిటీ రంగంపై దృష్టి పెట్టింది. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన మొబిలిటిని అందించేందుకు సిద్ధమైంది. లాస్ వెగాస్ లో జరిగిన 2025 సీఈఎస్ లో రెక్టర్ దాని ఆల్ టెర్రైన్ మొబిలిటీ ఉత్పత్తులను ప్రదర్శించింది. స్కైడర్ ఎక్స్ 1 ఫ్లయింగ్ మోటార్ సైకిల్ ను లాంచ్ చేసింది. ఈ బైకు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆటో షోలో ఈ బైకు ప్రదర్శన స్టార్ ఎగ్జిబిట్ మారింది. అంతేకాదు ఈ ప్రదర్శనలో ఈ బైకును నిపుణులు సైతం ప్రశంసించారు.
ఇక ఈ ఎగిరే మోటార్ సైకిల్ ఫీచర్లు చూసినట్లయితే అచ్చం విమానం వలే గాలిలో ఎగురుతుంది. ఇప్పటికే ఉన్న తక్కువ ఎత్తులో ఎగిరే ఉత్పత్తులతో పోలిస్తే స్కైరైడర్ X1 దాని తేలికైన నిర్మాణం, మెరుగైన వశ్యత, పోటీ ధరలతో ప్రత్యేకంగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కైరైడర్ X1 బైక్ 40 నిమిషాలపాటు గాల్లో ఎగురగలిగే సామర్ధ్యం కలిగి ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఎగరడానికి బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది. ఈ బైకు నీలం, నలుపు రంగుల్లో ఉంటుంది. ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. కంపెనీ ఈ బైకు ధర $60k డాలర్లని కంపెనీ తెలిపింది. ఇండియన్ కరెన్సీలో 4.92కోట్లు. ఈ బైకును కార్బన్ ఫైబర్ కాంపోజిట్, ఏవియేషన్-గ్రేడ్ అల్యూమినియం బాడీ కలిగి ఉంటుంది. అయితే మీరు ఈ బైక్ కొనాలంటే చైనా వెళ్లాలి. మీరు ట్రాఫిక్ జామ్ లో ఇబ్బంది పడుతుంటే.. గాలిలో ఎగురుతూ ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లాలనుకుంటే ఇంతకంటే మంచి ఆప్షన్ మరొకటి ఉండదేనే చెప్పవచ్చు.






