- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BUS TICKETS: దసరాకు ఊరెళ్తున్నారా? ఇలా టికెట్లు బుక్ చేసుకుంటే రూ.500 వరకు డిస్కౌంట్!
పలు టికెట్ బుకింగ్ యాప్స్ (ticket bookings) ఆఫర్స్ ప్రకటించాయి. వాటిని వాడుకుని బుక్ చేసుకుంటే టికెట్ ధర కాస్త తగ్గే అవకాశం ఉంది.

దిశ, వెబ్ డెస్క్: పండుగలు వచ్చాయంటే చాలు ప్రజలు పట్టణాలను వదిలి సొంత ఊర్లకు బయలుదేరుతారు. అక్బోబర్ 2న దసరా పండుగ (dussera) ఉన్న సంగతి తెలిసిందే. పండుగ నేపథ్యంలో స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారు. దీంతో ఇప్పటి నుండే చాలా మంది సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. అయితే చాలా గ్రామాలకు ట్రైన్ సౌకర్యం ఉండదు కాబట్టి ఎక్కువగా బస్ ప్రయాణమే చేస్తారు. అలాంటి వారి కోసం పలు టికెట్ బుకింగ్ యాప్స్ (ticket bookings) ఆఫర్స్ ప్రకటించాయి. వాటిని వాడుకుని బుక్ చేసుకుంటే టికెట్ ధర కాస్త తగ్గే అవకాశం ఉంది.
abhi busలో టికెట్ బుక్ చేసుకునేవాళ్లు దాదాపు రూ.300 సేవ్ చేసుకోవచ్చు. ఇందులో టీఎస్ఆర్టీసీ టికెట్లపై రూ.300 డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఇందులో 150 రూపాయలు మొదటిసారి మాత్రమే బుకింగ్ చేసుకునేవారికి వర్తించగా, మరో 150 రూపాయలు అబి బస్ యూజర్లు ఎవరైనా వాడుకోవచ్చు. దీని కోసం మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు PP300 అనే ప్రోమో కోడ్ ఎంటర్ చేయాలి. అంతే కాకుండా పండగ ఆఫర్ కింద మరో ఆఫర్ కూడా ఉంది.
మొదటిసారి ఇందులో టికెట్ బుక్ చేసుకునే యూజర్లు FESTIVAL అనే కూపన్ కోడ్ ద్వారా ఏకంగా రూ.500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. వినియోగదారుడు కనీసం రూ.1000 టికెట్లు కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతే కాకుండా రోజులో మధ్యాహ్నం 12 గంటల నుండి మ. 2గంటల మధ్య, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. అంతే కాకుండా ఈ ఆఫర్ కేవలం ప్రైవేటు ట్రావెల్ బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. దీంతో పాటు sbi credit card యూజర్ల కోసం కూడా ఓ ఆఫర్ ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ యూజర్లు 2వేల విలువ గల టికెట్లు బుక్ చేస్తే వారికి వెంటనే రూ.200 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.






