- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIR INDIA: సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్
సీనియర్ సిటిజెన్లకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రయాణికులకు దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించేందుకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ సిటిజెన్లకు ఎయిర్ ఇండియా (AIR INDIA) గుడ్ న్యూస్ చెప్పింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రయాణికులకు దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించేందుకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు పేర్కొంది. ఛార్జీలలో డిస్కౌంట్, అదనపు లగేజీ తీసుకెల్లడానికి అనుమతి లాంటివి ఇవ్వడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడుతోంది. సీనియర్ సిటిజన్లు ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకుంటే అన్ని క్యాబిన్లలోనూ బేస్ ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఉచితంగా 10 కేజీల అదనపు లగేజీ తీసుకువెళ్లేందుకు సైతం అనుమితిచ్చింది.
అయితే లగేజీ ఎంత తీసుకువెళ్లవచ్చు అనేది ప్రయాణించే క్లాస్ ను బట్టి ఉంటుంది. ఎకానమీ క్లాసుకు ఒక విధంగా, బిజినెస్ క్లాస్ టికెట్ పై ఒకరంగా ఉంటుంది. మరోవైపు డొమెస్టిక్ విమానాల్లో 25 శాతం డిస్కౌంట్తో పాటు 15కేజీల లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. ఇక ప్రయాణికులు టికెట్లను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ల ద్వారా, మొబైల్ యాప్స్ ద్వారా, కాల్ సెంటర్ల ద్వారా బుకింగ్ చేసుకోవాలని పేర్కొంది. ఆఫర్ పొందేందుకు సీనియర్ సిటిజన్ కేటగిరీ ఎంచుకోవడంతో పాటు వయసు నిర్ధారించేందుకు ఐడీ కార్డ్ తప్పనిసరి చేసింది.






