- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదెక్కడి దరిద్రం.. తెలుగు టీవీ షోలో బట్టల్లేకుండా డ్యాన్స్
ఒకప్పుడు తెలుగు టీవీ షోలు ఎంతో వినోదాత్మకంగా చాలా నీట్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా టీవీ షోలలో బూతే కంటెంట్‌గా మారిపోయింది. కామెడీ షో అంటేనే డబుల్ మీనింగ్‌గా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు తెలుగు టీవీ షోలు ఎంతో వినోదాత్మకంగా చాలా నీట్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా టీవీ షోలలో బూతే కంటెంట్‌గా మారిపోయింది. కామెడీ షో అంటేనే డబుల్ మీనింగ్‌గా మారిపోయింది. కంటెస్టెంట్లు డబుల్ మీనింగ్ జోకులు వేయడం, జడ్జిలు పగలబడి నవ్వడం ఇదే షో అయిపోయింది. చిన్నపిల్లలపై, మహిళలపై సైతం వల్గర్ జోకులు వేస్తూ టీఆర్పీ కోసం టీవీ షోల అర్థాన్నే మార్చేశారు. కేవలం కామెడీ షోలనే కాకుండా డ్యాన్స్ షోల తీరును సైతం పూర్తిగా మార్చేశారు. డ్యాన్స్ షోలో డ్యాన్స్ తప్ప మిగితావన్నీ చేస్తున్నారు.
డ్యాన్స్ షోలో సంబంధం లేకుండా జోకులు వేయడం, అనవసర ఎమోషనల్ సీన్లు క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ప్రేక్షకులతో ఛీ కొట్టించుకుంటున్నారు. ఇక తాజాగా ఓ డ్యాన్స్ షోలో డ్యాన్సర్లు బట్టలు లేకుండా డ్యాన్స్ చేశారు. నిజానికి చిన్న షార్ట్ వేసుకున్నారు కానీ అది కనిపించకుండా టవల్స్ కట్టుకుని, దానిని కవర్ చేస్తూ స్టెప్పులు వేశారు. రాజు అనే కంటెస్టెంట్ ఈ డ్యాన్స్ చేయగా జడ్జీలు తిట్టకుండా స్పీకర్లు పగిలేలే నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇదెక్కడి దరిద్రం రా అని మండిపడుతున్నారు. ఇది డ్యాన్స్ షోనా లేదంటే సర్కస్సా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. VIDEO






