మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కలకలం.. 983 పక్షుల మృతి

by  |
మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కలకలం.. 983 పక్షుల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కొత్తగా 983 పక్షులు మృతి చెందాయి. లాతూర్‌లో 253, యవత్మల్‌లో 205, అహ్మద్ నగర్ 151, వార్ధా 109, నాగ్‌పూర్ 45, గోందియాలో 23 ఫౌల్ట్రీ పక్షులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటి నమూనాలను పుణె, భోపాల్‌లోని డీఐఎస్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌కు పంపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5,151 పక్షులు మృతి చెందాయని అధికారులు పేర్కొన్నారు.

ముంబై, ఘోడ్‌బందర్‌, దపోలిలో కాకులు, హెరాన్స్‌ బర్డ్‌, మురాంబాలో ఫౌల్ట్రీ పక్షల నమూనాలను సేకరించగా ఏయిన్‌ఫ్లూ బారినపడ్డట్లు గుర్తించారు. బీడ్ జిల్లాలో పలు కాకులకు హెచ్‌5ఎన్‌8 వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాన్ని వైరస్‌ జోన్‌గా ప్రకటించారు. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు ఇచ్చింది. సాధారణ ప్రజలకు ఫ్లూ గురించి తెలిసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. మాంసం, గుడ్లను పూర్తిగా ఉడికించి తినాలని అధికారులు సూచిస్తున్నారు.


Next Story