ఈ ఏడాది 85,149 ఇంజనీరింగ్ సీట్లకు అనుమతి

by  |
Pharmacy Colleges
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది రాష్ట్రంలో 161 ఇంజనీరింగ్ కళాశాలలో 85,149 సీట్లకు, 91 బీఫార్మసీ కళాశాలలో 7,640 సీట్లకు అనుమతులు లభించాయి. మరో 56 ఇంజనీరింగ్ కళాశాలలకు 2వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంజనీరింగ్‌లో 60,697 సీట్లు, బీఫార్మసీ సీట్లలో ఎంపీసీ విద్యార్థులకు 2,691, బీపీసీ విద్యార్థులకు 2,691 మొత్తం 5,382 కన్వీనర్ సీట్లు భర్తీ కానున్నాయి.

కళాశాలలకు అనుమతులు మంజూరు కావడంతో శనివారం నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 16 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు 59,901 మంది విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలిన పూర్తయిందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. నేటితో ధ్రువపత్రాల పరిశీలన ముగియనుందని చెప్పారు.



Next Story

Most Viewed