బాలికను సంచిలో చుట్టి తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా!

115

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామంలో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఏడేళ్ల పాపను గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎవరూ చూడకుండా బాలికను సంచిలో చుట్టి సైకిల్ పై తీసుకెళ్తుండగా ఒక్కసారిగా ఆ చిన్నారి జారీ కిందపడిపోయింది.

గమనించిన గ్రామస్తులు తొలుత ఆ వ్యక్తిని చుట్టుముట్టి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. అయితే, బాలిక ఎవరు.. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..