78 వేల మందిని తరలిస్తున్న ఏపీ?

by Vemula.Srinu Prasad |

<p>వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రైళ్ల సేవలు ప్రారంభించింది. ఈ ఉదయం హైదరాబాదు నుంచి ఒక రైలు జార్ఖండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి సంబంధించిన వలస కూలీలను తరలించేందుకు ఐదు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఎంత మంది వలస కూలీలు ఉన్నారన్న సమాచారం సేకరించే బాధ్యతను ఏపీలోని [&hellip;]</p>

78 వేల మందిని తరలిస్తున్న ఏపీ?
X

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రైళ్ల సేవలు ప్రారంభించింది. ఈ ఉదయం హైదరాబాదు నుంచి ఒక రైలు జార్ఖండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి సంబంధించిన వలస కూలీలను తరలించేందుకు ఐదు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో ఎంత మంది వలస కూలీలు ఉన్నారన్న సమాచారం సేకరించే బాధ్యతను ఏపీలోని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 1902 టోల్ ఫ్రీనెంబర్‌ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత రెండ్రోజుల్లో పది వేల మంది సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీకి చెందిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, మత్స్యకారులు తమిళనాడు, యూపీ, ఒడిశా, కాశీ తదితర ప్రాంతాల్లో ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో సుమారు 12,602 మంది చిక్కుకున్నట్టు సమాచారం ఉంది. అలాగే ఏపీలోనే వివిధ జిల్లాల్లో సుమారు 66 వేల మందికి పైగా ఉన్నట్టు అంచనాలున్నాయి.

దీంతో వారందర్నీ తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 750 ఆర్టీసీ బస్సులతో పాటు మరో 200 ప్రైవేటు బస్సులను కూడా రవాణా శాఖ వేసింది. వీటిల్లో 22,866 మంది వలస కూలీలు, కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత వారిని తొలుత క్వారంటైన్‌లో, ఆ తరువాత హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ఈ మార్గాల ద్వారానే కాకుండా జాతీయ రహదారులపై గూడ్స్‌ వాహనాల ద్వారా కూడా పలువురు వారి వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హైవేలపై వాహనాల రద్దీ 45% పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు.

Tags: migrent workers, andhrapradesh, transport for migrents,

Next Story