‘777 చార్లి’.. స్పెషల్ పర్సన్‌ కోసం కుక్కపిల్ల ప్రయాణం

by  |
‘777 చార్లి’.. స్పెషల్ పర్సన్‌ కోసం కుక్కపిల్ల ప్రయాణం
X

దిశ, సినిమా : యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్‌లో ఇండియన్ సినిమాలు రావడం అరుదు. కానీ యూనిక్ అటెంప్ట్‌తో ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దితే బ్లాక్ బస్టర్ ఖాయం. అలాంటి కేటగిరికి చెందిన సినిమానే ‘777 చార్లి ’. లాబ్రడార్ డాగ్‌ మెయిన్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ టీజర్‌ను తెలుగులో నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేయగా.. ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంది. తన లైఫ్‌లో స్పెషల్ పర్సన్‌ను మీట్ అయ్యేందుకు చార్లి (కుక్క పిల్ల) చేస్తున్న ప్రయాణాన్ని ఈ క్యూటెస్ట్ టీజర్‌లో చూపించగా.. ఎండ, వాన తేడా లేకుండా రోడ్లు, పర్వతాలు మీదుగా తన జర్నీ కొనసాగిస్తుంది.

గ్రేట్ పర్పస్‌తో కూడుకున్న చార్లి జర్నీ.. ధర్మను మీట్ కావడంతో పూర్తి కాగా అక్కడి నుంచే అడ్వెంచర్ స్టార్ట్ అవుతుందని ఈ బ్రిలియంట్ అండ్ హార్ట్‌టచింగ్ టీజర్ ద్వారా తెలిపారు మేకర్స్. రక్షిత్ శెట్టి ధర్మ క్యారెక్టర్ ప్లే చేస్తుండగా.. ఆయన బర్త్ డే సందర్భంగా ‘ 777 చార్లి’ టీజర్ రిలీజ్ చేస్తూ విషెస్ అందించారు. కాగా కిరణ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎస్ గుప్తాతో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించడం విశేషం. నోబిన్ పాల్ అందించిన మ్యూజిక్ టీజర్‌కు బిగ్ అస్సెట్ కాగా కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమా విడుదల కానుంది.



Next Story

Most Viewed