రైనా రిటైర్మెంట్‌కు ' 73 ' కారణమంట

by  |
రైనా రిటైర్మెంట్‌కు  73  కారణమంట
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్లు ధోని, సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా ఆగస్టు 15న కొద్ది సమయంలో వ్యవధిలో రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిటైర్మెంట్ వెనుక రీజన్ ఏమై ఉంటుందని చాలామంది ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనా తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. దీంతో సురేష్ రైనా రిటైర్మెంట్ వెనుక అసలు విషయమేమిటో తెలియనున్నది.

అదేమంటే.. సురేష్ రైనా రిటైర్మెంట్ కు సంబంధించి తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘ధోనీ జెర్సీ నెంబర్ 7, నాది 3. రెండు పక్కపక్కన ఉంచితే 73. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి ఈరోజు (ఆగస్టు 15)కు 73 ఏళ్లు అవుతోంది. సో.. ఇంతకంటే మంచి సమయం ఉండబోదని రిటైర్ అయ్యాను’ అని రైనా చెప్పారు. మరో విషయమేమిటంటే.. రిటైర్మెంట్ గురించి వీరిద్దరూ ముందే మానసికంగా ఫిక్స్ అయినట్లు సురేష్ వెల్లడించారు.

Next Story

Most Viewed